Wednesday 29 August 2007

సంతృప్తి

మనిషి ఆశకు అంతు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది.భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం.లేని వాటి కోసం చేతులు చాచకూడదు.ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు.ఆయనకు అందరూ సమానమే.

మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి.

అందరికీ అన్నీ ఉన్నాయని బాధ పడకూడదు.మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.

Wednesday 22 August 2007

హనుమాన్ చాలీసా

దోహా

శ్రీ గురుచరణ సరోజరజ,నిజమనముకుర సుధార
బరణౌ రఘువర విమల యశ,జోదాయక ఫలచార

బుద్దిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార
బలబుధ్ధి విద్యాదేహు మోహిం హరహు కలేశ్ వికార

1.జయహనుమాన జ్ఞాన గుణసాగర జయకపీశ తిహులోక ఉజాగర
2.రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామ
3.మహావీర విక్రమ బజరంగీ కుమతినివార సుమతికే సంగీ
4.కంచన వరణ విరాజసువేశ కానన కుండల కుంచిత కెశా
5.హాథ వజ్ర ఔద్వజా విరాజై కాంథే మూంజ జనేవూ సాజై
6.శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన
7.విద్యావాన గుణి అతిచాతుర రామకాజ కరివేకో ఆతుర
8.ప్రభుచరిత్ర సునివేకో రసియా రామలఖన సీత మన బసియా
9.సూక్ష్మ రూప ధరి సియహిదిఖావ వికటరూప ధరి లంక జరావ
10.భీమరూప ధరి అసుర సమ్హారే రామ చంద్రకే కాజ సవారే
11.లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి వురలాయే
12.రఘుపతి కీన్హీ బహుత బడాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి
13.సహస వదన తుమ్హరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై
14.సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా
15.యమ కుభేర దిగపాల జహాతే కవికోవిద కహి సకై కహాతే
16.తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా
17.తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగజానా
18.యుగ సహస్ర యోజన పరభానూ లీల్యో తాహి మధుర ఫల జానూ
19.ప్రభుముద్రికా మేలిముఖ మహీ జలధి లాంఘిగయే అచరజ నాహీ
20.దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
21.రామ దు ఆరే తమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైసారే
22.సబ సుఖ లహై తుమ్హారీ సరనా తుమ రక్షక కాహూ కో డరనా
23.ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై
24.భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై
25.నాశై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత బలవీరా
26.సంకట సే హనుమాన చుడావై మన క్రమ బచన ద్యాన జోలావై
27.సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా
28.ఔర మనోరథ జోకో ఇలావై నోయి అమిత జీవన ఫల పావై
29.చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా
30.సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే
31.అష్ట సిద్ది నవనిధి కే దాతా అస వర దీన జానకీ మాతా
32.రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతికే దాసా
33.తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఖ బిసరావై
34.అంతకాల రఘుపతి పురజాయీ జహా జన్మ హరిబక్త కహాయీ
35.ఔర దేవతా చిత్తన ధరయీ హనుమత సేయు సర్వ సుఖ కరయీ
36.సంకట హరై మిటై సబవీరా జో సుమిరై హనుమత బలవీరా
37.జైజైజై హనుమాన గోసాయీ కృపాకరో గురుదేవకీనాయీ
38.జోహ శతబార పాఠకర జోయీ చూటహి బంది మహా సుఖ హోయీ
39.జో యహ పడై హనుమాన చాలీసా హోయసిద్ది సాఖీ గౌరీసా
40.తులసీదాస సదా హరిచేరా కీజైనాథ హృదయ మహడేరా


దోహా

పవనతనయ సంకటహరన మంగళ మూరతి రూప

రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభూప



Monday 20 August 2007

చిన్ని చిన్ని సంతోషాలు

పని చేసి చాలా అలిసిపోయారా, జీవితం చాలా బిజీ అయిపోయిందా, చిన్న చిన్న సంతోషాలను ఎలా పొందాలో అర్థం కావడం లేదా.అయితే ఇవి చూడండి.

ఒక మంచి, నీకిష్టమైన స్నేహితునికి తనకి తెలియకుండా తన పుట్టిన రోజు పండగను ఏర్పాటు చేసి, ఒక మంచి బహుమతిని ఇవ్వండి.

వర్షంలో హాయిగా తడవండి, లేదా వర్షం తగ్గాక పార్క్ కి వెళ్ళి పచ్చ గడ్డి మీద నడవండి,కాసేపు కూర్చోని అక్కడి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఆనందించండి.

ఎఫ్.ఎం.వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫ్రెండ్ కి ఇష్టమైన పాటని వేయమని అడగండి.ఆ టైం లో మీ ఫ్రెండ్ ని రేడియో వినేలా చూడండి.

అమ్మ నాన్నలకి మంచి బహుమతి ఇవ్వండి వాళ్ళు అశ్చర్యపడేలా.

పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయండి.

వృధ్ధాశ్రమానికో, అనాధశరణాలయానికో వెళ్ళండి. అక్కడి వాళ్ళను ప్రేమతో పలకరించండి.

మీరే స్వయంగా ఏదైన వండి, అందరికీ వడ్డించండి.

ఫసిపిల్లలని ఎత్తుకోండి.వాళ్ళని నవ్వించండి.ఆ పాల బుగ్గలను చూస్తూ ప్రపంచాన్నే మరిచిపోండి.

బాల్య మిత్రులకు ఫోన్స్ చేయండి, మెయిల్స్ చేయండి.చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకోండి.

ఏదైన కొత్త సినిమా పాట కాని, దేవుడి పాట కాని నేర్చుకోండి.

నెలకి ఒక్కసారైనా మనసుకి నచ్చిన స్నేహితులని కలవండి.పిచ్చాపాటి మాట్లాడుకోండి.అందరు కలిసి సినిమాకైనా, ఒక మంచి ప్రదేశానికైనా వెళ్ళండి. లేదా ఇంట్లో నైనా కాసేపు కాలాన్ని ఎంజాయ్ చేయండి అందరికి ఆ నెలలో జరిగిన అనుభవాలాను చెబుతూ.ఆ అనందమే వేరుగా ఉంటుందండి.


Thursday 16 August 2007

నాకు నచ్చిన దైవం సాయినాథుడు


సాయి బాబా బక్తులందరికీ నా నమస్కారములు. నాకు సాయి బాబా అంటే చాలా ఇష్టం. నేను ఏ బాధనైనా, సంతోషన్నైనా బాబాకే చెప్పుకుంటాను. నాకు బాబా ఒక మంచి మిత్రుడు గానే భావిస్తాను.

నాకు ఏమైనా బాధ ఉన్నప్పుడు బాబా పాటలు వింటాను. మనసు ప్రశాంతంగా అవుతుంది.ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి బాబా పాటలు. బాబా సచ్చరిత్ర చదవడం అంటే చాలా ఇష్టం.అందులో బాబా గురించి చదువుతూ ఉంటే ఎన్నో సార్లు కళ్ళు చెమర్చాయి, అనంద బాష్పాలు వెలువడ్డాయి. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను నేను.

ఎవరైనా చదవని వారు ఉంటే మీరు చదివి ఆ ఆనందాన్ని ఆస్వాదించండి. అది చదువుతే ఎవరికైనా మంచి జరుగుతుందని నా నమ్మకం.నేను క్రింద ఒక వెబ్ అడ్రెస్స్ ఇస్తున్నాను.అందులో ఆన్ లైన్ లో మీరు సచ్చరిత్ర ను చదువుకోవచ్చు.

http://www.shirdisaiashirvadam.org/importantbooks/sacha/index.htm



ఈ రోజు గురువారం, నాకిష్టమైన రోజు.ఈ సందర్భంగా నాకు నచ్చిన ఒక సాయి గీతం.

ఎంతెంత దయనీది ఓ సాయి"2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయనీది ఓ సాయి "2"

నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

ఎంతెంత దయనీది ఓ సాయి "2"

తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో "2"
నుడులకు అందవు నుతులకు పొంగవు "2"
పాపాలు కడిగేసె పావన గంగవు


ఎంతెంత దయనీది ఓ సాయి "2"

నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

భక్త కభీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు "2"
అణువున నిండిన బ్రహ్మాండంలా ఆ ఆ.."2"
అందరిలో నేవే కొలువున్నావు

ఎంతెంత దయనీది ఓ సాయి"2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

ప్రభవించినావు మానవ మూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై "2"
మారుతి నీవే గణపతి నీవే "2"
సర్వదేవతల నవ్యాకృతి నీవే

ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయనీది ఓ సాయి "2"


బాబా సాయి బాబా
బాబా మా సాయి బాబా
బాబా బాబా షిరిడి బాబా

Wednesday 15 August 2007

భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మనమందరం భారతీయులు గానే జన్మిద్దాము.ఈ పుడమి తల్లి రుణము తీర్చుకుందాము.

నేను గత కొన్ని రోజుల నుండి యూ.కె. లో నివసిస్తున్నాను.ఇక్కడికి వచ్చాక భారతదేశం మీద ఇంతకుముందు ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు ఎక్కువ ప్రేమ పెరిగింది.దానికి కరణం, మరేమో కాదు,అక్కడి సాంప్రాదాయాలు, సంస్కృతి ఇక్కడ లేవు.అక్కడి ప్రేమానురాగాలు ఇక్కడ ఎంత వెతికినా దొరకవు.అక్కడి ఆహారపు అలవాట్లు, ఒకరికి ఇంకొకరు ఇచ్చుకునే గౌరవం ఇక్కడ లేదు.వేషదారణ చాలా వేరుగా ఉంటుంది.
ఎన్ని రకాలుగ అలోచించినా మన భారతీయతను ఇక్కడి ఆంగ్ల వారితో పొల్చలేము.మనం మనమే,మన భారతీయత మన దేశానిదే.

కావున నా మన్నవి ఎమిటంటే, భారతీయులు ఎక్కడైనా ఉండండి కాని మన మాతృభూమిని మరిచిపోకండి.
జైహింద్ .

Tuesday 14 August 2007

నాకు నచ్చిన కొన్ని మంచి మాటలు.

ఆత్మవిశ్వాసానికి మూలం ప్రశాంతతే

ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే ఆహ్లాదకరమైన వాతవరణం తో పరిసరాలు నిండి ఉండాలి.అలాంటి వాతవరణం కావాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఒత్తిడికి దూరంగా ఉండాలంటే సమస్యలు లేని సందర్భాలతో మమేకమై బతుకు కొనసాగించాలి.మరి ఇది ఎలా నిజ జీవితంలో సాధ్యం?

సమస్య ప్రతి జీవికి ఉంటుంది.సమస్య లేని జీవి ఉండడు.అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు.ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం.

సోమరితనమే శత్రువు

దయ్యం అందరినీ అశ పెడుతుంది,సోమరివాడు దయ్యాన్నే అశ పెడతాడనేది టర్కీ సామెత.అలసత్వం యాచనకు మూలం, వివేకానికి వేరు పురుగన్నది పెద్దలమాట.శరీర సోమరితనమే మనస్సులో అలసత్వానికి కారణం, ఈ అలసత్వం మూర్ఖుల విహార కేంద్రం, బలహీనుల రక్షణ స్థానం, నిరాశ నిస్పౄహలకు మాతౄమూర్తి.ఈ సోమరి తనం నేరాలకు పుట్టిల్లు, వ్యాధులకు మూలస్థానం, కదలని నీరు క్రిములకు స్థావరమైనట్టుగా, సోమరి మనసు కీడు తలపులకు స్థావరమవుతుంది.

ఈ సోమరితనాన్ని జయుంచాలంటే ప్రతి మనిషి సోమరితనమే తన మౄత్యువు, కార్యోత్సాహమే తన ప్రాణమని తెలుసుకోవాలి. కార్యసిద్ధి కలగాలంటే నదీ ప్రవాహం లాగ నిరంతరం చైతన్యం వహించాలి.కార్యదీక్ష వహించాలి.

మంచి మిత్రుడు

"ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని"

లోకంలో మన తల్లి తండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి మన స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్న యసూరి గారు.

బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు.

కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే ఉందాము. మనము అందరము ఈవిధంగా ఉన్నట్లు అయుతే మన సమాజం తప్పకుండా అమౄతవౄక్షం అవుతుంది.

గెలుపు

"ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం" అన్నాడు ఓ మహావ్యక్తి.అతనే ఐన్ స్టీన్.

మనం సాధారణంగా గెలుపు మీదనే శ్రధ్ధ పెడతాము, గెలిచామా లేదా అనేది మనకు ముఖ్యం కాని ఎలా గెలిచామనేది సాధారణంగా పట్టించుకోము. ఐన్ స్టీన్ చెబుతున్నది మాత్రం అది కాదు.ఓటమి ఎదురైనా ఫరవాలేదు విలువలకు మాత్రం ఎక్కడా లోతు రాకూడదని ఆయన అన్నాడు.


మహాత్మ గాంధి కూడ అదే అన్నారు."సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం" అని.ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యమని బాపూజీ అభిప్రాయం. ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు అని నా అభిప్రాయం.

అంతా మన మంచికే

సుఖమైనా దుఖ్ఖమైనా జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు.

ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు.


Sunday 12 August 2007

చిన్ననాటి హాస్టల్ ముచ్చట్లు.

అవి నాలుగవ తరగతి అయుపోతున్న రోజులు. నేను చాలా కష్టపడి గురుకుల పాఠశాలలొ ప్రవేశం కొరకు పరీక్ష రాసాను. మల్యాల మండలంలో ఫస్ట్ వచ్చాను. ఇంట్లో అందరు చాలా సంతోషపడ్డారు.తర్వాత కరీంనగర్లో రాసాను. కొన్ని రొజుల తర్వాత నేను ఎదుచూసిన ఫలితాలు వచ్చాయు. నాకు తాటిపల్లి గురుకుల పాటాశాలలో సీట్ వచ్చింది. చాలా సంతోషం.

కొత్త కొత్తగా ఏమి తెలియనీ వయసులో చిన్నప్పుడే హాస్టల్ లో చేరాను.అంతా కొత్త స్నేహితులు.హాస్టలో పదవ తరగతి వరకు అమ్మను,నాన్నని,ఇంట్లో వాళ్ళందరినీ వదలి ఆరు సంవత్సరాలు ఉన్నాను. మొదట్లో చాలా ఏడ్చేదాన్ని. కాని నా దగ్గరికి తాతయ్య వారానికి ఒకసారి వచ్చి నన్ను కలిసి నాకు ఎంతో దైర్యాన్ని ఇచ్చేవారు.మంచిగా చదువుకోమని చెప్పేవారు.


ఆ తరువాత నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.బాగా చదుకున్నాను.ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు నాకు క్లాస్ లో రెండవ ర్యాంక్ వచ్చింది.ఎంత కష్టపడ్డా ఒకటో ర్యాంక్ ఎన్నడు రాలేదు.

కాని నేను ఈ హాస్టల్ లో గడిపిన ఆరు సంవత్సరాలు,అక్కడి స్నేహితులను,ఉపాధ్యాయులను మరిచిపోలేను.అక్కడ గడిపిన ప్రతీ నిమిషం ఒక మధుర జ్ఞాపకమే నా జీవితం లో.

నేను అక్కడ చాలా నేర్చుకున్నాను ముఖ్యంగా క్రమశిక్షణ,పెద్దలను గౌరవించడం,స్నేహితులతో ఎలా ఉండడం,ఎంజాయ్ చేయడం,అందరితో కలిసి ఉండడం.

నాకు ఇప్పటికీ అక్కడి ఒక విషయం గుర్తుకు వస్తే ఏడుపు వస్తుంది ఏంటంటే ప్రొద్దున్నే నాలుగు గంటలకు పి.ఇ.టి.మేడం వచ్చి కాళ్ళమీద కొట్టి మరీ ఎక్సర్సైజ్,రన్నింగ్ కి తీసుకువెళ్ళేది.మేము చాలా ప్రయత్నించేవాళ్ళము తప్పించుకోవడానికి, కాని ప్రొద్దున చేయకుంటే సాయంత్రం ప్రొద్దున చేసిన దానికంటే డబుల్ పనిష్మెంట్ ఉండేది.నిజంగా చాలా ఏడుపు వచ్చేది.

అక్కడ ప్రతీ పండగ చాలా మంచిగా జరుపుతారు.అక్కడి తరువాత నేను ఏ పండగను అంతా మంచిగా మళ్ళి ఎక్కడ జరిగేటప్పుడు చూడలేదు. ముఖ్యంగా వినాయక చవితి,హోళి,కొత్త సంవత్సరపు సెలబ్రేషన్స్,క్రిష్నాష్టమి,క్రిస్టమస్.

ప్రతీ సంవత్సరం దసరా,సంక్రాంతి,ఎండాకలం మత్రమె ఇంటికి వెళ్ళేవాళ్ళము. మిగతా అంతా హాస్టల్ లోనే ఉండే వాళ్ళము.

నేను ఎప్పుడు మరిచిపోలేని సంఘటనలు ఏంటి అంటే,మేము అంతా కలిసి ఒకసారి మామిడి తొటలోకి వెళ్ళి తోటమాలిని మాటల్లో పెట్టి మామిడి కాయలు దొంగతనం చేయడం,హాస్టల్ లోకి జామకాయలు అమ్మడానికి వచ్చినవాళ్ళ దగ్గరినుండి జామకాయలు కొట్టేయడం.అవన్నీ గుర్తుకు వస్తే చాలా నవ్వు వస్తది అసలు.ఆ లైఫ్ చాలా వేరు కదా.ఏమంటారు? అందరు ఏవో చిన్న చిన్న కోతి పనులు చేసిన వాళ్ళే కదా చిన్నప్పుడు.

మాకు అసలు హాస్టల్ నుండి ఊర్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోతుండే వాళ్ళు ప్రిన్సిపాల్. మాకు ఏదైన సండే రోజు బోర్ కొడితే మేము గోడ దుంకి ఊర్లోకి వెళ్ళి రెండు,మూడు గంటలు తిరిగి వచ్చేవాళ్ళము.అలా ఒకసారి మా సర్ కి పట్టుబడ్డాము కూడ.మూడు గంటలు ఎండలో నిలుచోబెట్టారు.హా..హా..హా.

మేము చాలా ఆటలు ఆడేవాళ్ళము.నాకు కబడ్డీ,కో కో,వాలీబాల్,బాస్కెట్బాల్ ఆడడం సరిగా రాదు కాని, నన్ను అందరు ఇష్టపడే వాళ్ళు అందుకని నన్ను కూడ మెంబెర్ చేసుకునే వాళ్ళు,కాని నేను ఏమి అడకపోయేదాన్ని అయునా వాళ్ళు నన్ను ఏమి అనకపోతుండే చిన్నదాన్ని అని.

ఇంకా మేము ఈ ఆటలే కాకుండా చాలా ఆటలు ఆడేవాళ్ళము.టెన్ని కాయుట్,షటిల్,క్యారంస్,చెస్,అష్టచెమ్మ,చార్ పల్లి,జంటల్ టొక్క,కచ్చకాయలు,ఇంకా చాలా ఆడేవాళ్ళము.చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము.

నాకు ప్రతీ విషయం లో ఉపాద్యాయులు,స్నేహితులు చాలా సహాయం చేసేవాళ్ళు.వాళ్ళందరికీ నా క్రుతజ్ఞతలు.నాకు అన్నపూర్ణ,సరిత,అను,నహీమ,ప్రమీల,జ్యోతి,కవిత,రోజ,వర,కరుణ మంచి స్నేహితులు,ఇంకా వెంకట రమణ రెడ్డి,లచ్చన్న,విద్యా సాగర్ రావ్ ఉపాధ్యాయులు అంటే చాలా ఇష్టం, గౌరవం ఇప్పటికీ.

మేము ఆరు సంవత్సరాలలో కలిపి మూడు సినిమాలకి వెళ్ళాము.అవి ఏంటంటే 1)జురాసిక్ పార్క్ 2)మాతౄదేవోభవ 3)శుభ సంకల్పం


Saturday 11 August 2007

నా చిన్ననాటి కొన్ని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు.

నన్ను రోజు నాన్న స్కూల్ లో వదిలి రాగానే మళ్ళీ ఏదో ఒక వంక పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేదాన్ని.మొదటి రోజుల్లో నేను సరిగా స్కూల్ కి వెళ్ళకపోయేదాన్ని.

తర్వాత ప్రతి రోజు నిద్రలో లెక్కలు, ఇతర పాఠ్యాంశాలు కలవరించేదాన్ని. ఇప్పటికి నాన్న గుర్తు చేసి చాల నవ్వుతారు ఆ విషయాలు చెబుతూ.

నేను హాస్టల్ నుండి సెలవులకి ఇంటికి వచ్చిన ప్రతీసారి నన్ను అమ్మ,నాన్న చాలా ప్రేమగా చూసేవారు.వాళ్ళు నాకు ఎప్పుడూ ఫ్రెండ్స్ లాగా ఉండి నాతో అన్ని షేర్ చేసుకునేవాళ్ళు.నాన్న,నేను కలసి జగిత్యాల్ కి వెళ్ళి చాలా సినిమాలు చూసేవాళ్ళము.అమ్మ ఎప్పుడూ నాన్నకి తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చేది.

చిన్నప్పటినుంచీ తమ్ముడిని, నన్ను ఎక్కువగా ప్రేమగా పెంచింది అమ్మమ్మ, తాతయ్యలు.వాళ్ళు ఇద్దరు మాతో పాటే ఉంటారు.
నానమ్మ,తాతయ్య వాళ్ళు కూడ చాలా ప్రేమ చేసేవాళ్ళు.నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడళ్ళా నాకు డ్రెస్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు.

నాన్న మరియు ఒక అంకుల్ రోజు రాత్రి చాల కథలు చెప్పేవాళ్ళు.తమ్ముడిని, నన్ను బాగా నవ్వించే వాళ్ళు ఏదో ఏదో చెప్పి. కాని ఇప్పుదు ఆ అంకుల్ ఈ లోకం లో లేరు.అది చాలా భాధకరమైన విషయం.

ఇంకా నాకు ఎక్కువగా నవ్వు తెప్పించే విషయం ఏంటంటే నేను ఎప్పుడు మా ఇంట్లో కూరలు తినకుండా పక్కింట్లోవి తినేదాన్నంట. కాని ఇప్పుడైతే అమ్మ చెసిన ప్రతీది నాకు చాలా ఇష్టం.ఇంకా రోజు ఊరికి వెళ్తున్నా అని బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళేదాన్నట.

నేను స్కూల్ నుండి ఒకసారి తిరిగి వస్తుంటే ఒక చిన్న కాలువలో నేను, నా టిఫిన్ బాక్స్ కొట్టుకు పోయాము.అప్పుడు నా చిన్ననాటి స్నేహితుడు ఒకరు కాపాడారు.అదైతే భలే నవ్వు వస్తుంది నాకు.

చిన్నప్పుదు డ్యాన్స్ కూడ చేసాను స్కూల్లో.నాకు ఇష్తమైన మా చిన్నప్పటి పంతులు పేరు కిషన్ రావ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే, ఇలా చదువుకోవడానికి కారణం అతను నాకు చేసిన భోదనే.

Friday 10 August 2007

Welcome to my Blog

నా పేరు లావణ్య. ఈ బ్లాగుని వీక్షించే వారందరికి స్వాగతం, సుస్వాగతం.
నేను నాకు నచ్చిన కొన్ని అంశాలను ఇందులో బద్రపరుస్తాను.