Tuesday 14 August 2007

నాకు నచ్చిన కొన్ని మంచి మాటలు.

ఆత్మవిశ్వాసానికి మూలం ప్రశాంతతే

ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే ఆహ్లాదకరమైన వాతవరణం తో పరిసరాలు నిండి ఉండాలి.అలాంటి వాతవరణం కావాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఒత్తిడికి దూరంగా ఉండాలంటే సమస్యలు లేని సందర్భాలతో మమేకమై బతుకు కొనసాగించాలి.మరి ఇది ఎలా నిజ జీవితంలో సాధ్యం?

సమస్య ప్రతి జీవికి ఉంటుంది.సమస్య లేని జీవి ఉండడు.అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు.ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం.

సోమరితనమే శత్రువు

దయ్యం అందరినీ అశ పెడుతుంది,సోమరివాడు దయ్యాన్నే అశ పెడతాడనేది టర్కీ సామెత.అలసత్వం యాచనకు మూలం, వివేకానికి వేరు పురుగన్నది పెద్దలమాట.శరీర సోమరితనమే మనస్సులో అలసత్వానికి కారణం, ఈ అలసత్వం మూర్ఖుల విహార కేంద్రం, బలహీనుల రక్షణ స్థానం, నిరాశ నిస్పౄహలకు మాతౄమూర్తి.ఈ సోమరి తనం నేరాలకు పుట్టిల్లు, వ్యాధులకు మూలస్థానం, కదలని నీరు క్రిములకు స్థావరమైనట్టుగా, సోమరి మనసు కీడు తలపులకు స్థావరమవుతుంది.

ఈ సోమరితనాన్ని జయుంచాలంటే ప్రతి మనిషి సోమరితనమే తన మౄత్యువు, కార్యోత్సాహమే తన ప్రాణమని తెలుసుకోవాలి. కార్యసిద్ధి కలగాలంటే నదీ ప్రవాహం లాగ నిరంతరం చైతన్యం వహించాలి.కార్యదీక్ష వహించాలి.

మంచి మిత్రుడు

"ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని"

లోకంలో మన తల్లి తండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి మన స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్న యసూరి గారు.

బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు.

కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే ఉందాము. మనము అందరము ఈవిధంగా ఉన్నట్లు అయుతే మన సమాజం తప్పకుండా అమౄతవౄక్షం అవుతుంది.

గెలుపు

"ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం" అన్నాడు ఓ మహావ్యక్తి.అతనే ఐన్ స్టీన్.

మనం సాధారణంగా గెలుపు మీదనే శ్రధ్ధ పెడతాము, గెలిచామా లేదా అనేది మనకు ముఖ్యం కాని ఎలా గెలిచామనేది సాధారణంగా పట్టించుకోము. ఐన్ స్టీన్ చెబుతున్నది మాత్రం అది కాదు.ఓటమి ఎదురైనా ఫరవాలేదు విలువలకు మాత్రం ఎక్కడా లోతు రాకూడదని ఆయన అన్నాడు.


మహాత్మ గాంధి కూడ అదే అన్నారు."సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం" అని.ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యమని బాపూజీ అభిప్రాయం. ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు అని నా అభిప్రాయం.

అంతా మన మంచికే

సుఖమైనా దుఖ్ఖమైనా జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు.

ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు.


3 comments:

రాధిక said...

చాలా మంచి మాటలు చెప్పారు.నాకూ నచ్చాయి.

శ్రీనివాస said...

లావణ్య గారూ, మంచి విషయాలు రాసారు. వికీపీడియాకు చెల్లెలయిన వికీవ్యాఖ్యను తీర్చిదిద్దడంలో మీరూ పాలు పంచుకోండి.

- శ్రీనివాసరాజు దాట్ల
- http://blog.harivillu.org

Unknown said...

Emandi lavanya Gaaru,
blog baagundi, telugu lo chooda chakkaga vundi. nenu telugu blog intavaraku chandavaledu. manchi vishayalu suluvyna padala to anadariki arthamayye reeti lo baaga chepparu. akkadakkada konni chinna tappulu vunnai, adi bahusa langauge converter limitation kavachhu!! ('karanam', 'saampradaayalu', 'mannavi').

danya vaadaalu!!