Monday, 20 August 2007

చిన్ని చిన్ని సంతోషాలు

పని చేసి చాలా అలిసిపోయారా, జీవితం చాలా బిజీ అయిపోయిందా, చిన్న చిన్న సంతోషాలను ఎలా పొందాలో అర్థం కావడం లేదా.అయితే ఇవి చూడండి.

ఒక మంచి, నీకిష్టమైన స్నేహితునికి తనకి తెలియకుండా తన పుట్టిన రోజు పండగను ఏర్పాటు చేసి, ఒక మంచి బహుమతిని ఇవ్వండి.

వర్షంలో హాయిగా తడవండి, లేదా వర్షం తగ్గాక పార్క్ కి వెళ్ళి పచ్చ గడ్డి మీద నడవండి,కాసేపు కూర్చోని అక్కడి ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఆనందించండి.

ఎఫ్.ఎం.వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫ్రెండ్ కి ఇష్టమైన పాటని వేయమని అడగండి.ఆ టైం లో మీ ఫ్రెండ్ ని రేడియో వినేలా చూడండి.

అమ్మ నాన్నలకి మంచి బహుమతి ఇవ్వండి వాళ్ళు అశ్చర్యపడేలా.

పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయండి.

వృధ్ధాశ్రమానికో, అనాధశరణాలయానికో వెళ్ళండి. అక్కడి వాళ్ళను ప్రేమతో పలకరించండి.

మీరే స్వయంగా ఏదైన వండి, అందరికీ వడ్డించండి.

ఫసిపిల్లలని ఎత్తుకోండి.వాళ్ళని నవ్వించండి.ఆ పాల బుగ్గలను చూస్తూ ప్రపంచాన్నే మరిచిపోండి.

బాల్య మిత్రులకు ఫోన్స్ చేయండి, మెయిల్స్ చేయండి.చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకోండి.

ఏదైన కొత్త సినిమా పాట కాని, దేవుడి పాట కాని నేర్చుకోండి.

నెలకి ఒక్కసారైనా మనసుకి నచ్చిన స్నేహితులని కలవండి.పిచ్చాపాటి మాట్లాడుకోండి.అందరు కలిసి సినిమాకైనా, ఒక మంచి ప్రదేశానికైనా వెళ్ళండి. లేదా ఇంట్లో నైనా కాసేపు కాలాన్ని ఎంజాయ్ చేయండి అందరికి ఆ నెలలో జరిగిన అనుభవాలాను చెబుతూ.ఆ అనందమే వేరుగా ఉంటుందండి.


1 comment:

రాధిక said...

అవునవును....చిన్ని చిన్ని ఆనందాలు జీవితాన్ని చైతన్యం చేస్తాయి.