Wednesday 29 August 2007

సంతృప్తి

మనిషి ఆశకు అంతు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది.భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం.లేని వాటి కోసం చేతులు చాచకూడదు.ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు.ఆయనకు అందరూ సమానమే.

మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి.

అందరికీ అన్నీ ఉన్నాయని బాధ పడకూడదు.మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.

2 comments:

Naga said...

"మనిషి ఆశకు అంతు ఉండదు", "ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది", "భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం" - ఇటువంటి వాటిని సాంకేతికంగా "నమ్మకాలు" అంటాము. ఇటువంటి నమ్మకాల మూలంగా మన జీవితంలో "వాస్తవం" అనే తయారవుతుంది (ఇదొక నమ్మకం).

"మీకు అనవసరమయిన నమ్మకాలను మీరు వదలివేయండి, అప్పుడు జీవితంలో పరిస్థితులు కూడా మారతాయి!" అని బోధిస్తారు నవయుగ ఆధ్యాత్మికులు.

ఉదాహరణకు "మనకు ఇంకా కావాలి అని భగవంతున్ని ప్రార్ధిస్తూ - మీరు చివరి పేరాగ్రాఫులో వ్రాసింది చేస్తే ఇంకా సంతోషమే కదా! :) భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఎన్నడో "యద్భావం తద్భవతి" అన్నారు!

lavanya said...

hi lavanya
miru rasinatu manishi ki aasa vundali kani atyasa vundakudadu. nenu mitho ekibhavistanu, kani nowadays lo evaru ala vuntunaru. ala vundataniki every person try cheyalani korukundamu.